విజయ్ దేవరకొండది ఎంతో దయాగుణం.. పొగడ్తల్లో ముంచెత్తిన బాలీవుడ్ భామ అనన్య పాండే
- అమెరికాలో షూటింగ్ అప్పుడు సరదాగా గడిపామన్న అనన్య
- ‘లైగర్’ మాంచి మసాలా సినిమా అని వ్యాఖ్య
- అందరికీ నచ్చుతుందన్న ముద్దుగుమ్మ
విజయ్ ది ఎంతో దయాగుణమని వ్యాఖ్యానించింది. అద్భుతమైన వ్యక్తి అని చెప్పింది. అమెరికాలో షూటింగ్ సమయంలో సరదాగా గడిపామని గుర్తు చేసుకుంది. సినిమాకు సంబంధించి దాదాపు అన్నీ పూర్తయ్యాయని, నా డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయిందని చెప్పింది. ఆగస్టులో సినిమా విడుదలవుతుందని, మాంచి మసాలా సినిమా అని చెప్పుకొచ్చింది. సినిమాను చూసి అభిమానులు ఆనందిస్తారని తెలిపింది.
కాగా, ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. విజయ్ కు బాలీవుడ్ ఎంట్రీ తొలిసారి కావడం విశేషం. అటు అనన్య పాండేకి కూడా తెలుగులో అరంగేట్ర సినిమా ఇది.