దిశ యాప్ అమలుకు 18 రాష్ట్రాల అడుగులు: ఏపీ మంత్రి ధర్మాన
- మహిళల భద్రతకు ఏపీలో దిశ యాప్
- యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న లక్షల మంది మహిళలు
- యాప్ ద్వారా జగన్ దేశానికే దిశానిర్దేశం చేశారన్న ధర్మాన
ఈ యాప్‌పై శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో దిశ యాప్ ద్వారా సీఎం జగన్ దేశానికే దిశానిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏపీ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు దిశ యాప్ అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నాయని కూడా ధర్మాన తెలిపారు.