ఏపీ పరిస్థితులపై కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: సీపీఐ నారాయణ
- పొరుగు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నమన్న కేటీఆర్
- ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్న సీపీఐ నారాయణ
- ఆంధ్రా- తమిళనాడు సరిహధ్దును పరిశీలించి ఆధారాలు చూపిన వైనం
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రా- తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని నారాయణ సందర్శించారు. ఏపీ రోడ్లతో తమిళనాడు రోడ్లను ఆయన పోల్చి చూశారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే.... నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అన్నారు.