Sensex: ఈ రోజు నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు కోల్పోయి 56,819కి పడిపోయింది. నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 17,038కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.05%), ఏసియన్ పెయింట్స్ (0.73%), టీసీఎస్ (0.47%), హెచ్సీఎల్ (0.17%), రిలయన్స్ (0.08%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-7.24%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.88%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.21%), టైటాన్ (-2.19%), విప్రో (-1.91%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News