వామ్మో.. ఇంటి నేమ్ ప్లేట్ కు షారూఖ్ పెట్టిన ఖర్చుతో సామాన్యుడు ఓ ఇంటినే కొనొచ్చు!
Add ap7am to your home Screen

వామ్మో.. ఇంటి నేమ్ ప్లేట్ కు షారూఖ్ పెట్టిన ఖర్చుతో సామాన్యుడు ఓ ఇంటినే కొనొచ్చు!

Shahrukh Name Plate Has a Cost Of Rs 25 Lakh
  • క్లాసీ టచ్ తో మన్నత్ నేమ్ ప్లేట్ డిజైన్
  • దానికి రూ.25 లక్షల దాకా ఖర్చు
  • దగ్గరుండి డిజైన్ చేసిన షారూఖ్ భార్య గౌరీ
బాలీవుడ్ బాద్ షాకు తన ఇల్లు ‘మన్నత్’ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంటికి ఇటీవల కొన్ని మరమ్మతులు చేయించారు. అందులో భాగంగా ఇంటి నామ ఫలకాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ‘మన్నత్– ల్యాండ్స్ ఎండ్’ అంటూ నిలువు అక్షరాలతో నేమ్ ప్లేట్ కు రూపునిచ్చారు. 

స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. ఆ నేమ్ ప్లేట్ కు తన నైపుణ్యాలతో రూపాన్నిచ్చింది. మామూలుగా అయితే దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. కానీ, దానికి పెట్టిన ఖర్చే ఇప్పుడు చర్చకు దారి తీసింది. అవునుమరి, ఆరడుగుల శిలాఫలకానికే రూ.25 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో సామాన్యుడు ఓ చిన్నపాటి ఇంటిని కొనుక్కొని సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. 

షారూఖ్ కుటుంబానికి సరిపోయేలా క్లాసీ టచ్ ఇచ్చేందుకే నేమ్ ప్లేటుకు ఇంతలా ఖర్చు పెట్టారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా, మూడేళ్ల తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న షారూక్.. ఇప్పుడు కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కలిసి ‘జీరో’ అనే సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాంలతో కలిసి ‘పఠాన్’ అనే మరో సినిమాలోనూ బాద్ షా నటిస్తున్నాడు. 

అట్లీ దర్శకత్వంలో నయనతార, సాన్యా మల్హోత్రాలతో కలిసి మరో సినిమా కూడా చేస్తున్నాడు. శరణార్థుల పరిస్థితిని కళ్లకు కట్టేలా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న ‘దున్కీ’ అనే సినిమాలోనూ నటించనున్నాడు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించనుంది.
Bollywood
Shahrukh Khan
Mannat

More Telugu News