ఏపీ హోం మంత్రిగా తానేటి వనిత పదవీ బాధ్యతల స్వీకారం
- తొలి కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వనిత
- మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సైతం పదవిని పొందిన వైనం
- ఏకంగా హోం శాఖను దక్కించుకున్న వనిత
- క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని వెల్లడి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. సీఎం జగన్ అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. టెక్నాలజీ వినియోగంలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్న వనిత.. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు.