అందుకే 'పుష్ప 2'లో బన్నీ లుక్ మార్చేస్తున్నారట!

Pushpa 2 movie update
  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • 'పుష్ప 2' కోసం మొదలైన సన్నాహాలు 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • బన్నీ లుక్ లో అంచలంచెలుగా మార్పులు 
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమా హైలైట్స్ లో ప్రధానంగా చెప్పుకోవలసింది బన్నీ లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. ఆయన యాస గురించి. ఈ మూడూ కూడా ఈ పాత్రను కొత్తగా ఆవిష్కరించాయి. బన్నీకి భారీ స్థాయిలో ప్రశంసలను తెచ్చిపెట్టాయి.

ఇక త్వరలో సెకండ్ పార్టుగా 'పుష్ప 2' సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మొదటి పార్టులో కనిపించిన దానికి భిన్నంగా బన్నీ లుక్ ఉంటుందని అంటున్నారు. పుష్ప సంపాదన పరుడు అవుతున్న కొద్దీ ఆయన తన స్టైల్ మార్చేసుకుంటూ రావడం ఫస్టు పార్టులోనే చూపించారు. 

సెకండ్ పార్టు మధ్యకి వచ్చేసరికి పుష్ప లుక్ .. ఆయన స్టైల్ పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. ఫస్టుపార్టులో పుష్ప పాత్రను డిజైన్ చేసిన తీరు వలన ఆయనలోని డాన్సర్ కి కళ్లెం వేసినట్టు అయింది. ఈ సారి బన్నీ మార్కు డాన్సులు ఉంటాయని సమాచారం. మరి ఆ పాత్రలోని లోపాలను సరిచేస్తారా? లేదంటే ప్రేక్షకులను ఊహాలోకంలోకి తీసుకుని వెళతారా? అనేది చూడాలి.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2 Movie

More Telugu News