Santhosh Sobhan: 'శ్రీదేవి శోభన్ బాబు' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Sridevi Sobhan Babu movie lyrical song released
షార్ట్స్‌లో చూడండి
సంతోష్ శోభన్ హీరోగా 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా రూపొందింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల నిర్మించిన ఫస్టు మూవీ ఇది. ప్రశాంత్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.

ఈ సినిమాకి కమ్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నిను చూశాకా మతిపోయిందే .. మది నా మాటే విననంటుందే' అంటూ ఈ పాట సాగుతోంది. రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించాడు.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన పాట ఇది. ట్యూన్ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. అలాగే సాహిత్యపరమైన మెరుపులు కూడా లేవు. రొటీన్ గానే అనిపిస్తుంది. తెరపై కథ నడుస్తున్నప్పుడు .. ఈ పాట వచ్చే సందర్భం వలన ఆకట్టుకుంటుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Go Back to Shorts
Santhosh Sobhan
Gowry Kishan
Sridevi Sobhan Babu Movie

More Telugu News