ఎన్టీఆర్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్

Four people tested corona positive in NTR district
  • గత 24 గంటల్లో 3,504 కరోనా పరీక్షలు
  • ఐదుగురికి పాజిటివ్
  • ఏలూరు జిల్లాలో ఒక కేసు
  • కరోనా నుంచి కోలుకున్న ఏడుగురు
  • ఇంకా 31 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్య 10కి లోపే నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 3,504 శాంపిల్స్ పరీక్షించగా, 5 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వీటిలో ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 4 కొత్త కేసులు గుర్తించారు. మరొక కేసు ఏలూరు జిల్లాలో నమోదైంది. అదే సమయంలో ఏడుగురు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

ఏపీలో ఇప్పటిదాకా 23,19,622 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,861 మంది ఆరోగ్యవంతులయ్యారు. మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే మరి కొన్నిరోజుల్లో ఏపీ కరోనా రహిత రాష్ట్రంగా మారనుంది.
.
Go Back to Shorts
NTR District
Corona Virus
Positive Cases
Andhra Pradesh

More Telugu News