Jagan: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన జగన్

Jagan leaves to Delhi
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రధానితో చర్చించనున్నారు. 

పోలవరం ప్రాజెక్ట్ కు సవరించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Delhi

More Telugu News