పాత రూ.10, 20, 50, 100 నోట్లు చెల్లవా?.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లారిటీ!
- వైరల్ వార్తను ఖండించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- పాత నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీయేనని స్పస్టీకరణ
- నోట్ల రద్దుపై ఆర్‌బీఐ ఎలాంటి ఆదేశాలు లేవన్న బ్యాంకు
- అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచన
ఈ ప్రచారంపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పందించింది. తమ పేరుతో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని, అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వివరణ ఇచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీయేనని గతంలోనే స్పష్టం చేసింది. 2015లో వాటి చలామణి తగ్గిందని, అవసరమైతే వాటిని కొత్త నోట్లతో మార్చుకోవచ్చని సూచించింది. కానీ ఆ నోట్లను రద్దు చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.
కొత్త నోట్లలో అధునాతన భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ నోట్లను అరికట్టడం సులభమవుతుందని మాత్రమే ఆర్‌బీఐ పేర్కొంది. పాత నోట్లు చెల్లవన్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరోసారి స్పష్టం చేసింది.
ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని తెలిపింది.