భాగ్యరాజ్ మృతి కలచివేసింది: చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భాగ్యరాజ్ మృతి కలచివేసింది: చిరంజీవి

Bhagyaraj death saddened me says Chiranjeevi
  • గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందిన భాగ్యరాజ్
  • రెండు రోజుల క్రితమే తాము కలుసుకున్నామన్న చిరంజీవి
  • జోకులు వేసుకుంటూ ఫొటోలు తీసుకున్నామని వెల్లడి
  • భాగ్యరాజ్ మరణ వార్తను నమ్మలేకపోతున్నానన్న చిరు
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... భాగ్యరాజ్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, గుండె ఆవేదనతో నిండిపోయిందని, బాధను మాటల్లో వర్ణించలేనని చెప్పారు. “నిన్న కాక మొన్న కూడా గోవాలో కుష్ (కుష్బూ) కుటుంబ వివాహ వేడుకలో భాగ్యరాజ్‌గారితో కలిసి నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఫొటోలు తీసుకున్నాం. ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన మరణ వార్త విని నమ్మలేకపోతున్నాను” అని తెలిపారు.

“భాగ్యరాజ్ ఒక గొప్ప దర్శకుడు, అసాధారణ స్క్రీన్‌ప్లే రచయిత, నటుడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది” అని కొనియాడారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కొడుకు, కూతురికి ఈ భాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాని అని చెప్పారు. భాగ్యరాజ్ మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Advertisement
Bhagyaraj
Chiranjeevi
Bhagyaraj Death
Tamil Director Bhagyaraj
Chiranjeevi Condolences
Indian Cinema

More Telugu News