శ్రీలంక సంక్షోభంపై బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందన ఇదే
- శ్రీలంకకే చెందిన జాక్వెలిన్
- తన గుండె పగిలిందని వ్యాఖ్య
- ఏ ఒక్కరినీ దూషించడానికి త్వరపడకండని విజ్ఞప్తి
శ్రీలంక సంక్షోభంపై ఏ ఒక్కరు కూడా తొందరపడి ఏదో ఒక అంచనాకు రావద్దని సదరు సందేశంలో జాక్వెలిన్ విజ్ఞప్తి చేశారు. శ్రీలంక జాతీయురాలిగా తన దేశాన్ని, దేశ ప్రజలను చూసి తన గుండె పగిలిందని ఆమె వ్యాఖ్యానించారు. తన దేశంలో సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న వాదనలు వినిపించాయని ఆమె చెప్పుకొచ్చారు. కంటికి కనిపించదానినే నమ్మి...ఈ సంక్షోభానికి కారణమంటూ ఏ ఒక్కరిని దూషించరాదని ఆమె విజ్ఞప్తి చేశారు.