Tollywood: జాన్ అబ్ర‌హాంకు అల్లు శిరీష్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

allu sirishcounter to john abraham
షార్ట్స్‌లో చూడండి
తెలుగు చ‌ల‌న చిత్రాల్లో తాను న‌టించ‌బోనంటూ బాలీవుడ్ హీరో జాన్ అబ్ర‌హాం చేసిన కామెంట్ల‌కు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీస్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. తాను బాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌బోన‌ని అల్లు శిరీష్ కీల‌క వ్యాఖ్య చేశాడు. బాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉండే కంటే, టాలీవుడ్‌లో అట్ట‌డుగు హీరోగా ఉండ‌టానికే తాను ప్రాధాన్యం ఇస్తాన‌ని శిరీష్ చెప్పుకొచ్చాడు.

ఈ మేర‌కు టాలీవుడ్ ఎంట్రీపై జాన్ అబ్ర‌హాం ప్ర‌క‌ట‌న చేసిన మ‌రునాడే శ‌నివారం అల్లు శిరీష్ నుంచి ఘాటు కౌంట‌ర్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ మార్కెట్ మించి టాలీవుడ్ సినిమాలు స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌న తాజా చిత్రం అటాక్ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టాలీవుడ్ చిత్రాల్లో న‌టించే అంశంపై కామెంట్ చేశాడు.
Go Back to Shorts
Tollywood
Bollywood
Allu Sirish
John Abraham

More Telugu News