Active Cases: ఏపీలో 202కి తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

Decline in active cases numbers in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో నిన్న 251గా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు, నేడు 202కి తగ్గాయి. గడచిన 24 గంటల్లో 9,394 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 4 కేసులు గుర్తించారు. 

అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,628 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
Go Back to Shorts
Active Cases
Andhra Pradesh
Corona Virus
Daily Update

More Telugu News