'వీరమల్లు'ను పూర్తిచేసే వరకూ సెట్టు దిగని పవన్!
- షూటింగు దశలో 'వీరమల్లు'
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్
ఇక ఇప్పుడు ఈ సినిమా మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేయాలనే పట్టుదలతో పవన్ రంగంలోకి దిగుతున్నాడు. ఇకపై ఈ ప్రాజెక్టు లేట్ కాకూడదనే ఉద్దేశంతో ఏకధాటిగా పవన్ 5 నెలల సమయాన్ని కేటాయించినట్టుగా చెబుతున్నారు. ఆగస్టు నాటికి ఈ సినిమాను పూర్తిచేసి, ఆ వెంటనే మిగతా పనులు స్టార్ట్ చేస్తారట.
ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. చారిత్రక నేపథ్యంలో తొలిసారిగా పవన్ చేస్తున్న ఈ సినిమాను, దసరాకి రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.