'రేసుగుర్రం' విలన్ రవికిషన్ ఇంట విషాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రేసుగుర్రం' విలన్ రవికిషన్ ఇంట విషాదం

Actor Ravikishan brother passes away
  • రవికిషన్ సోదరుడు రమేశ్ మృతి
  • డాక్టర్లు శ్రమించినా ఫలితం దక్కలేదన్న రవికిషన్
  • సంతాపాన్ని ప్రకటించిన సీఎం యోగి
ప్రముఖ సినీ నటుడు, 'రేసుగుర్రం' ఫేమ్, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేశ్ శుక్లా ఈరోజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్న రమేశ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన సోదరుడు మృతి చెందిన విషయాన్ని రవికిషన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందని రవికిషన్ చెప్పారు. తన తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదరుడు కూడా మృతి చెందడం తమ కుటుంబాన్ని కలచివేస్తోందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రవికిషన్ కు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. యూపీలోని గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా రవికిషన్ గెలుపొందారు. మరోవైపు రమేశ్ మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని తెలియజేశారు.
Ravikishan
Tollywood
Brother
Dead

More Telugu News