'ఆర్ఆర్ఆర్' దెబ్బకు బద్దలవుతున్న బాక్సాఫీస్ రికార్డులు.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..!
Add ap7am to your home Screen

'ఆర్ఆర్ఆర్' దెబ్బకు బద్దలవుతున్న బాక్సాఫీస్ రికార్డులు.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..!

RRR collections crosses Rs 500 Cr
  • సంచలనాలను నమోదు చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'
  • అన్ని రాష్ట్రాల్లో ఫుల్ అవుతున్న థియేటర్లు
  • ఇప్పటి వరకు రూ. 500 కోట్లను అధిగమించిన కలెక్షన్లు
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. విడుదలైన తొలి షోకే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో... ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా అన్ని చోట్లా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. 

నిన్నటి వరకు ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వివరాలను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ రోజు కూడా అదే ఊపు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇండియన్ సినిమాకు ఈ చిత్రం మరింత ఖ్యాతిని తీసుకొచ్చిందని కొనియాడారు. కరోనా సమయంలో, సెలవులు లేని రోజుల్లో రిలీజైనా... 'ఆర్ఆర్ఆర్' తిరుగులేని విధంగా దూసుకుపోతోందని అన్నారు.
RRR
Collections
Tollywood
Bollywood

More Telugu News