ద కశ్మీర్ ఫైల్స్ దర్శకుడిపై పోలీస్ కంప్లైంట్
- భోపాలీ పదానికి కొత్త అర్థం చెప్పిన డైరెక్టర్
- అగ్నిహోత్రిపై కేసు నమోదు చేయాలి
- ముంబై పోలీసులకు అందిన ఫిర్యాదు
ద కశ్మీర్ ఫైల్స్ విజయానందంలో ఉన్న అగ్నిహోత్రి తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా భోపాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అగ్నిహోత్రిపై కేసు నమోదు చేయాలంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.