అది మేము కట్టించిన స్టేడియమే: యోగి ప్రమాణస్వీకారంపై అఖిలేశ్ యాదవ్ చురక
- నిన్న ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్
- అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియంలో ప్రమాణస్వీకారం
- ప్రమాణస్వీకారం కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రమే కాదన్న అఖిలేశ్
'గతంలో సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం నిర్మించిన స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు' అంటూ చురక అంటించారు. ప్రమాణస్వీకారం అనేది కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రమే కాకూడదని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రమాణస్వీకార లక్ష్యమని చెప్పారు.