రాజమౌళి సార్.. మీకు, మాకు మధ్య తేడా ఇదే: సుకుమార్

Sukumar praises Rajamouli
  • సూపర్ హిట్ అయిన 'ఆర్ఆర్ఆర్' మూవీ
  • రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్న సినీ ప్రముఖులు
  • మేము ఆకాశంలో ఉన్నా.. మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలన్న సుకుమార్
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి, రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ దర్శకుడు సుకుమార్ కూడా ఈ చిత్రాన్ని చూశారు. అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ రాజమౌళి గొప్పదనం గురించి మాట్లాడారు. 

మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవడానికి తాము పరుగెత్తాలని అన్నారు. తాము ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి అని చెప్పారు. 'రాజమౌళి సార్... మీకు, మాకు ఒకటే తేడా. ఇలాంటి సినిమా మీరు తీయగలరు. మేము చూడగలం అంతే' అని అన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' సినిమా కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Sukumar
Rajamouli
RRR
Tollywood

More Telugu News