Andhra Pradesh: ఏపీలో తాజాగా 30 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

AP Corona daily updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. 10,529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 51 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,297 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,082 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 485 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Updates
Today Cases

More Telugu News