ఢిల్లీ-దోహా విమానానికి తప్పిన ప్రమాదం... పాకిస్థాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్

Doha bound Qatar Airways plane from Delhi emergency landed in Karachi airport
ఢిల్లీ నుంచి దోహా బయల్దేరిన ఓ విమానం పాకిస్థాన్ లో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. ఇది ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం. వంద మందికి పైగా ప్రయాణికులతో ఈ వేకువ జామున ఢిల్లీ నుంచి దోహా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. అయితే, గాల్లోకి లేచిన కొద్దిసేపటి తర్వాత విమానం కార్గో విభాగంలో పొగలు వస్తున్నట్టు గుర్తించారు. దాంతో ఆ విమానాన్ని పాకిస్థాన్ లోని కరాచీ నగరం వైపు మళ్లించారు. కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. ప్రయాణికులను మరో విమానం ద్వారా దోహా పంపేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ఏర్పాట్లు చేస్తోంది.
Go Back to Shorts
Qatar Airways
New Delhi
Doha
Karachi
Emergency Landing
Pakistan

More Telugu News