Andhra Pradesh: ఏపీలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్

AP Corona Daily Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 8,081 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 58 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో తాజాగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 518 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 14,730 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News