తెలంగాణలో గత 24 గంటల్లో 52 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 16,241 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 25 కొత్త కేసులు
- అనేక జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 91 మంది
- ఇంకా 738 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,840 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 738 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

.