ప్రభాస్ కోసం మారుతి సెట్ చేసిన టైటిల్ అది కాదట!
- ప్రభాస్ తో మారుతి భారీ ప్రాజక్టు
- ప్రచారంలో 'రాజా డీలక్స్' టైటిల్
- ఆ టైటిల్ రవితేజ కోసమంటూ వార్తలు
- త్వరలో ప్రభాస్ సినిమా టైటిల్ వెల్లడి
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో మారుతి ఒక సినిమా చేయనున్నాడనీ .. ఆ సినిమా టైటిల్ 'రాజా డీలక్స్' అనే టాక్ వచ్చింది. తాను చెప్పేవరకూ వెయిట్ చేయమని మారుతి స్పందించాడు కూడా. అయితే ఇది రవితేజ కోసం మారుతి అనుకున్న టైటిల్ అనేది తాజా సమాచారం. రవితేజతో మారుతి ఈ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళతాడన్న మాట.
ఇక ప్రభాస్ తో చేయనున్న సినిమా టైటిల్ ను త్వరలోనే మారుతి ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కి సంబంధించిన ఈ సినిమాకి టైటిల్ ను సెట్ చేసే పనిలోనే ఆయన టీమ్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారనే సంగతి తెలిసిందే.