అందుకే నేను రాజీనామా చేశా: స్పీకర్ తమ్మినేనికి ఎమ్మెల్యే గంటా లేఖ
- విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నేను వ్యతిరకం
- కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గత ఏడాది రాజీనామా
- నా రాజీనామాను ఆమోదించాలన్న గంటా
ఈ మేరకు గంటా శ్రీనివాసరావు.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈ రోజు ఓ లేఖ రాశారు. తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశానని, ఏడాదికి పైగా కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన అన్నారు.