పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ ఓటమి.. ప్రజాస్వామ్యమే గెలిచిందంటూ కామెంట్
- తన ఓటమిని అంగీకరిస్తూ అమరీందర్ ట్వీట్
- ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు
- కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు ఓటేశారని ప్రశంస
పంజాబ్ లో అధికారంలోకి రాబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పంజాబ్ ప్రజలు నిజమైన ఆదర్శం చూపించారని, కులాలు, వర్గాలకు అతీతంగా ఓటేసి తామేంటో నిరూపించారని కొనియాడారు. భగవంత్ మన్ కు ఆయన అభినందనలు తెలిపారు.
కాగా, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక ఆయన సొంతంగా పార్టీని స్థాపించి.. బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూతో గొడవల నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి మద్దతు కరవైంది.