పంజాబ్ లో 'ఆప్' స్వీప్ చేస్తున్న తరుణంలో సిద్ధూ స్పందన
- పంజాబ్ లో అఖండ విజయం దిశగా ఆప్
- ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న సిద్ధూ
- ఆప్ కు శుభాకాంక్షలు తెలిపిన వైనం
ఈ నేపథ్యంలో పంజాబ్ లో ఆప్ అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీకి వెలుపల మరో రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ ప్రజల తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. ప్రజా తీర్పు దేవుడి తీర్పు వంటిదని అన్నారు. ఆప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.