Jagan: గతంలో మీరూ అదే చేశారుగా అన్న అచ్చెన్న.. నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న జగన్

i will resign if you prove it says jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీలో నిన్న చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రతిపక్షమైన టీడీపీ తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. సభలో నినాదాలు చేశారు. అయినప్పటికీ, గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్‌ను అవమానించడం సరికాదని, కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం నిన్న జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలో ఇదే అంశాన్ని జగన్ ప్రస్తావించారు. సమావేశానికి  హాజరైన అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగినట్టు సమాచారం.

జగన్: చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. మీ (టీడీపీ సభ్యుల) తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా ఉంది.
అచ్చెన్నాయుుడు:  గతంలో మీరూ ఇదే పని చేశారన్న సంగతిని గుర్తు చేసుకోండి.
జగన్: నేను చేసినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తాను. మంత్రిమండలిని కూడా రద్దు చేస్తా. 
అచ్చెన్న: గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది ఇదే మొదటిసారి కాదు. 
జగన్: మేమెప్పుడూ అలా చేయలేదు. చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తాను. 
అచ్చెన్న: మీరు చేశారని నేను అనడం లేదు. గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం గతంలోనూ జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
Governor
Atchannaidu

More Telugu News