అచ్చొచ్చిన హారర్ థ్రిల్లర్ జోనర్లో హన్సిక!

Hansika new movie update
  • అందాల కథానాయికగా హన్సికకి పేరు 
  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్ 
  • హారర్ థ్రిల్లర్ సినిమాలతో హిట్స్ 
  • అదే జోనర్లో మరో సినిమాకి సిద్ధం  
హన్సికను చూసిన తరువాత ఆమె అందం గురించి ఒక అరగంటసేపైనా ఆలోచించకుండా ఉండలేము. అంతటి గ్లామర్ ఆమె సొంతం. అందువల్లనే కోలీవుడ్ లో ఆమె విగ్రహం పెట్టేసి గుడి కూడా కట్టేశారు. అంత అందంగా ఉన్న హన్సిక తన ఆటపాటలతోనే కాదు, హారర్ సినిమాలతోను మెప్పించడం విశేషం.

తమిళంలో సుందర్ సి.దర్శకత్వంలో ఆమె చేసిన హారర్ సినిమాలు 'చంద్రకళ' .. 'కళావతి' టైటిల్స్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇక్కడ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆమె మరో హారర్ థ్రిల్లర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ఆర్.కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగు పార్టును రెండు నెలల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో, అందుకు తగినట్టుగా ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో హన్సిక సైంటిస్ట్ పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Hansika
Kannan
Kollywood

More Telugu News