సీఎం జగన్ ను మరోసారి కలిసిన అలీ
- ఇటీవల సినీ పెద్దలతో కలిసి సీఎం వద్దకు వచ్చిన అలీ
- తనను మరోసారి కలవాలన్న సీఎం జగన్!
- ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అలీ
2019 ఎన్నికల వేళ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని అలీ ఆశించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, స్థానిక సమీకరణాల దృష్ట్యా వైసీపీ అధినాయకత్వం సీటు ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ అలీ పార్టీ కోసం విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు.