'వీరమల్లు' తాజా షెడ్యూల్ కి ముహూర్తం కుదిరినట్టే!

Hari Hara Veera Mallu movie update
  • రిలీజ్ కి రెడీగా 'భీమ్లా నాయక్'
  • షూటింగు దశలో 'వీరమల్లు'
  • మార్చి 18 నుంచి నెక్స్ట్ షెడ్యూల్
  • కథానాయికగా నిధి అగర్వాల్
పవన్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భీమ్లా నాయక్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా ఆయన 'హరి హర వీరమల్లు' సినిమాను చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం వలన .. 'భీమ్లా నాయక్'ను ముందుగా పూర్తి చేద్దామని పవన్ అనుకోవడం వలన, 'వీరమల్లు' షూటింగు కొంతకాలంగా ఆపడం జరిగింది. ఈ లోగా మరిన్ని భారీ సెట్లను కూడా క్రిష్ దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. ఇక వచ్చేనెల నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టే ఆలోచన చేశారని అంటున్నారు.

మార్చి 18వ తేదీ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఇక ఈ సారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చకచకా మిగతా 50 శాతం చిత్రీకరణను జరిపేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా అందాల సందడి చేయనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో అర్జున్ రాంపాల్ .. ఆదిత్య మీనన్ .. శుభలేఖ సుధాకర్ కనిపించనున్నారు.
Go Back to Shorts
Pavan Kalyan
Nidhi Agarwal
Krish
Hari Hara Veeramallu Movie

More Telugu News