సూర్య కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారు!
- పాండిరాజ్ దర్శకత్వంలో 'ఈటి'
- సూర్య సరసన నాయికగా ప్రియాంక
- సంగీత దర్శకుడిగా ఇమాన్
- మార్చి 10వ తేదీన విడుదల
ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' సినిమాలు రెండూ కూడా అనూహ్యమైన ఆదరణ పొందాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇతరుక్కుమ్ తునింధవన్' సిద్ధమవుతోంది. తెలుగులో ఈ సినిమాను 'ఈటీ' టైటిల్ తో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
మార్చి 10వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది. తెలుగులో సూర్య తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక మోహన్ ఆకట్టుకోనుంది. ఇమాన్ సంగీతాన్ని అందించగా, సత్యరాజ్ .. శరణ్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.