రూ. 6 లక్షలు పట్టుకుని ప్రియుడితో పారిపోయిన యువతి.. ప్రేమ జంటను పట్టుకున్న పోలీసులు
- కుటుంబంతో సన్నిహితంగా ఉండే యువకుడితో లవ్
- ఇంటి అవసరాల కోసం దాచిపెట్టిన సొమ్ముతో ఉడాయింపు
- పది రోజులపాటు గాలించి పట్టుకున్న పోలీసులు
కుమార్తెతోపాటు ఇంట్లో దాచిపెట్టిన రూ. 6 లక్షలు కూడా మాయం కావడంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది రోజులపాటు గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో యువతీయువకులు తప్పుడు మార్గాల్లో నడిచి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.