తెలంగాణలో వెయ్యికి దిగువన కరోనా రోజువారీ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

Telanagana corona bulletin
  • గత 24 గంటల్లో 61,573 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 19,850 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గత కొన్నివారాలతో పోల్చితే తొలిసారిగా వెయ్యికి లోపు కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 61,573 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 2,484 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,80,836 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,56,883 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,850 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 4,103కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News