తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 48,434 కరోనా పరీక్షలు
- 1,217 మందికి పాజిటివ్
- గ్రేటర్ హైదరాబాదులో 383 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 26,498 మందికి చికిత్స
అదే సమయంలో 3,944 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,77,530 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,46,932 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 26,498 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,100కి పెరిగింది.
