తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురి మృతి
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,603
- రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34,665
ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,69,407కి పెరిగింది. ఇప్పటి వరకు 7,30,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,094 మంది మృతి చెందారు.
