'భీమ్లా నాయక్' సినిమాలో బ్రహ్మానందం పోషించబోయే పాత్ర ఇదేనట!

Brahmanandam playing forest officer role in Bheemla Nayak
  • పవన్, రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్'
  • ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నట్టు ప్రచారం
  • హీరోయిన్లుగా నటిస్తున్న నిత్యా మీనన్, సంయుక్త మీనన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. ఆయన పోషించబోయే పాత్ర గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారనేదే ఆ వార్త. బ్రహ్మానందం పాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ త్వరలోనే రానున్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Go Back to Shorts
Bheemla Nayak
Brahmanandam
Character

More Telugu News