Sensex: కొత్త ఏడాదిలో తొలిసారి నష్టపోయిన మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
2022లో తొలి మూడు సెషన్లు లాభాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాదిలో తొలిసారి నష్టాలను చవిచూశాయి. కరోనా కేసులు భారీగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపింది.

దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 621 పాయింట్లు నష్టపోయి 59,601కి పడిపోయింది. నిఫ్టీ 179 పాయింట్లు కోల్పోయి 17,745 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.74%), భారతి ఎయిర్ టెల్ (1.64%), మారుతి (1.13%), బజాజ్ ఫైనాన్స్ (0.67%), టైటాన్ (0.58%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-2.58%), టెక్ మహీంద్రా (-2.42%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.01%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.87%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News