'రాధేశ్యామ్' టీమ్ పరిశీలనలో కొత్త రిలీజ్ డేట్!
- ప్రేమకథా చిత్రంగా 'రాధేశ్యామ్'
- విదేశీ నేపథ్యంలో సాగే కథ
- హస్తసాముద్రికుడిగా ప్రభాస్
- మార్చి 18న రిలీజ్ చేసే ఛాన్స్
విదేశీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో చేసే సాహసాలే ఈ సినిమా. అలాంటి ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఎంతగానో ఊరించింది. భారీస్థాయి ప్రమోషన్స్ తో మరింతగా ఆసక్తిని పెంచింది. కానీ కరోనా తీవ్రత పెరిగిన కారణంగా థియేటర్లు మూతబడుతుండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.
అయితే, ఈ సినిమా విడుదల మళ్లీ ఎప్పుడు వుంటుందనే ఒక ఆసక్తి అందరిలో పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను మార్చి 18వ తేదీన విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త తాజాగా వినిపిస్తోంది. ఆ డేట్ ను లాక్ చేసుకుని, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చునని అనుకుంటున్నారట.