'పుష్ప' ఓటీటీ విడుదల.. అధికారికంగా ప్రకటన
- అతడు పోరాడతాడు.. పరిగెడతాడు..
- ఎగిరి దూకుతాడు.. అంతేగానీ, ఎప్పటికీ తగ్గేదేలే
- అంటూ అమెజాన్ ప్రైమ్ ప్రకటన
- ఈ నెల 7న తమ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని వివరణ
'అతడు పోరాడతాడు.. పరిగెడతాడు.. ఎగిరి దూకుతాడు.. అంతేగానీ, ఎప్పటికీ తగ్గేదేలే' అంటూ పుష్ప రాజ్ ఓటీటీలో అడుగుపెడుతున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఈ నెల 7న రాత్రి 8 గంటల నుంచి తమ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని వివరించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది.