ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు: సినీ నటుడు సుమన్
- కొంతకాలంగా రగులుతున్న సినిమా టికెట్ల అంశం
- తిరుపతిలో సుమన్ మీడియా సమావేశం
- అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకోవాలన్న సుమన్
- ఇండస్ట్రీలో సీనియర్లున్నారని వ్యాఖ్య
- వారి సలహాలు తీసుకోవాలని సూచన
ఇండస్ట్రీలో కృష్ణంరాజు, మురళీమోహన్, కృష్ణ వంటి సీనియర్లు ఉన్నారని, సమస్యల పరిష్కారానికి సీనియర్ల సలహాలు తీసుకోవాలని సుమన్ సూచించారు. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు.