త్వరలోనే ఏఆర్ రెహమాన్ కుమార్తె వివాహం... వరుడు ఎవరంటే..!
- డిసెంబరు 29న ఖతీజా నిశ్చితార్థం
- ఖతీజా రెహమాన్ పెద్ద కుమార్తె
- రియాసిద్దీన్ తో నిశ్చితార్థం
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కార్యక్రమం
ఇక, ఖతీజా మనువాడబోయే వ్యక్తి పేరు రియాసిద్దీన్ షేక్ మహ్మద్. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన రియాసిద్దీన్ కూడా సంగీత రంగంతో సంబంధం ఉన్నవాడే. సినీ, వినోద రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఖతీజా గతంలో 'రోబో' చిత్రంలో ఓ పాట కూడా పాడింది. రోబో చిత్రానికి రెహమానే సంగీతం అందించారు. డిసెంబరు 29న ఖతీజా పుట్టినరోజు కాగా, అదే రోజున నిశ్చితార్థం జరిగింది. ఖతీజా, రియాసిద్దీన్ ల పెళ్లికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. కాగా, రెహమాన్ కు ఖతీజా, రహీమా అనే కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు కూడా ఉన్నారు.