సాయిపల్లవి విషయంలో అది నిజమేనేమో: నాని

Shyam Singha Roy movie update
  • 'శ్యామ్ సింగ రాయ్' కి మంచి రెస్పాన్స్ 
  • రాహుల్ కి రాజమౌళి ప్రశంసలు 
  • సాయిపల్లవి నటన అద్భుతం 
  • దిల్ రాజు గారు అన్నట్టే జరిగిందన్న నాని
నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను తెరకెక్కించాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ సక్సెస్ మీట్ లో నాని మాట్లాడుతూ .. "సినిమా బాగుందని ఎవరూ రెండు ముక్కల్లో చెప్పేసి ఊర్కోవడం లేదు .. పేజీల కొద్దీ చెప్పేస్తున్నారు .. రాసేస్తున్నారు. ఈ సినిమాను ఫస్టు టైమ్ చూసిన దిల్ రాజు గారు, థియేటర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని చెప్పారో, అలాంటి రెస్పాన్స్ నే నేను చూస్తున్నాను. దర్శకుడిగా రాహుల్ కి రాజమౌళి గారి నుంచి లభించిన ప్రశంసలే ఆయన ప్రతిభకు కొలమానంగా నేను భావిస్తున్నాను. ఇక కృతి శెట్టి ఉందంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్ ను ఈ సినిమా నిజం చేసింది.

'ప్రణవాలయ' డాన్స్ కోసం సాయిపల్లవి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అయినా ఆమె ముఖంలో ఆ చిరునవ్వు అలానే ఉండేది. ఈ సినిమాలో .. "చుట్టూ ముళ్లున్నా అందరికీ అందాన్నీ .. ఆనందాన్ని పంచే రోజా పువ్వు నువ్వు" అనే డైలాగ్ ఉంది. ఆమె అంకిత భావం విషయంలో ఆ డైలాగ్ నిజమేననిపిస్తోంది" అంటూ ఆమెను అభినందించాడు.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Krithi Shetty
Shyam Singha Roy Movie

More Telugu News