నైజామ్ లో 'శ్యామ్ సింగ రాయ్' తొలిరోజు వసూళ్లు!
- 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
- బెంగాలీ యువతిగా సాయిపల్లవి
- నిన్ననే రిలీజ్ అయిన సినిమా
- తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్
ఆ దేవదాసీ పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుంది. ఈ ఇద్దరి లుక్స్ కూడా బెంగాలీ ప్రాంతానికి చెందినవిగానే ఉంటాయి. ఇటు నాని లుక్ .. అటు సాయిపల్లవి లుక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. తొలి రోజునే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.
నైజామ్ లో ఈ సినిమా తొలి రోజున 1.6 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.
ఈ సినిమా డీసెంట్ గా ఉందనే టాక్ వచ్చిందంటూ టీమ్ సందడి చేసింది. క్రిస్మస్ రోజున .. ఆదివారం రోజున వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకంతో నాని ఉన్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.