నాకు డాన్స్ వచ్చుగదా అని ఆ పాట పెట్టలేదు: సాయిపల్లవి
- దేవదాసీగా కనిపిస్తాను
- సందర్భానికి తగిన పాట అది
- నా డాన్స్ ను మెచ్చుకుంటున్నారు
- రిలీజ్ డేట్ కోసం వెయిటింగన్న సాయిపల్లవి
తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ, ''ఈ సినిమాలో నేను చేసిన డాన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని అనుకుంటున్నాము. నాకు డాన్స్ వచ్చుగదా అని ఈ పాటను పెట్టలేదు. సందర్భానికి తగినట్టుగానే ఈ పాటను పెట్టడం జరిగింది.
ఈ సినిమాలో నేను దేవదాసీ పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్రని అర్థం చేసుకుని చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. నా పాత్ర .. ఈ సినిమా రెండూ కూడా నాకు మంచి పేరు తీసుకువస్తాయని భావిస్తున్నాను. మీ అందరితో పాటే నేను కూడా ఈ సినిమాను థియేటర్లో చూడటానికి ఉత్సాహంగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.