సీఎం జగన్ కు మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా: సుమన్

Hero Suman wishes CM Jagan better health
షార్ట్స్‌లో చూడండి
సీఎం జగన్ పుట్టినరోజు (డిసెంబరు 21)ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలకు తెరదీశాయి. గుంటూరులో నిర్మల సహృదయ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సినీ నటుడు సుమన్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలో పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ యంగ్ అండ్ డైనమిక్ అని కొనియాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేకమంది సీఎంల పనితీరును పరిశీలించానని, యువ సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు మరెక్కడా చూడలేదని అన్నారు.

ప్రజాసంక్షేమం విషయంలో జగన్ తన తండ్రి వైఎస్ ను మించిపోయారని కీర్తించారు. ఇప్పుడున్న పథకాల కంటే మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు సుమన్ తెలిపారు. అందుకోసం జగన్ కు మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. 
Go Back to Shorts
Suman
CM Jagan
Birthday
YSRCP
Andhra Pradesh

More Telugu News