రవితేజతో కలిసి రచ్చ చేయనున్న పాయల్!
- 'ఆర్ ఎక్స్ 100'తో క్రేజ్
- రొమాంటిక్ బ్యూటీగా పేరు
- వెబ్ సిరీస్ లతోను బిజీ
- ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్
ఒక వైపున కథానాయికగా తనకి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతోను బిజీ అవుతోంది. ఇక హాట్ హాట్ ఐటమ్ లో ఛాన్స్ వచ్చినా ఈ బ్యూటీ వదులుకోవడం లేదు. తాజాగా 'ధమాకా' సినిమాలో రవితేజతో కలిసి ఒక ఐటమ్ లో చిందేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఇందులోని ఒక మాస్ నెంబర్ కి ముందుగా అనసూయను అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో తెలియదు గాని, తాజాగా పాయల్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.