'ఆచార్య' ఫిక్స్ అయితే ఇక అంతే!

Acharya movie update
  • 'ఆచార్య'గా మెగాస్టార్
  • ముఖ్యమైన పాత్రలో చరణ్
  • రిలీజ్ డేట్ మారనుందంటూ టాక్
  • అందులో నిజం లేదన్న మేకర్స్
చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందింది. చరణ్ - నిరంజన్ రెడ్డి కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అవినీతిపరుల భరతం పట్టాలంటే ఆయుధం పట్టాల్సిందే అనే ఉద్దేశంతో ఇద్దరు కథానాయకులు అడుగుముందుకు వేసే కథ ఇది. ఈ సినిమాలో చిరూ సరసన కాజల్ మెరవనుంది.

ఇక 'సిద్ధ' అనే ఒక ముఖ్యమైన పాత్రను చరణ్ చేయగా, ఆయన జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. ఇప్పటికే 'నీలాంబరి' పాత్రతో లుక్ పరంగా ఆమె ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రావడం లేదంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వెంటనే మేకర్స్ స్పందించారు. తమ సినిమా వాయిదా పడనుందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్స్ కి వస్తుందని స్పష్టం చేశారు. రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్లను కూడా వదిలారు..
Go Back to Shorts
Chiranjeevi
Kajal Agarwal
Ramcharan
Pooja Hegde
Acharya Movie

More Telugu News